- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగమే ఆయువు తీసిందా ?
దిశ, నల్లగొండ: అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే బైక్ పై ఐదుగురు ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రం లెప్రసీ కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు అద్దంకి నార్కట్ పల్లి హైవేపై వెళుతున్నారు. మార్గమధ్యలో నల్లగొండ జిల్లాకేంద్రం లెప్రసీ కాలనీ గొల్లగూడు ఎఫ్‌సీఐ గోదాముల వద్దకు రాగానే ఎదురుగా గేదెలు అడ్డు వచ్చాయి. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నారుల తల్లిదండ్రులు, ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భరోసా..
ప్రజలకు దగ్గరలో ఉండాలనే సంకల్పంతో నల్లగొండలోనే నివసించే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నార్కట్ పల్లి అద్దంకి హైవేపై ప్రయాణిస్తున్న ఆయనకు లెప్రసీ కాలనీ గొల్లగూడ దగ్గరకు రాగానే రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్నారు. హుటాహుటిన తన వాహనం దిగి, 108 అంబులెన్స్ వాహనాన్ని పిలిపించారు. ఇద్దరు చిన్నారులను, గాయపడిన ముగ్గురు క్షతగాత్రులకు ధైర్యంచెప్పి గొల్లగూడ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు ఫోన్ చేసి ఆదేశించారు.
- Tags
- MLA Kancharla