ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం..

by  |
ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం..
X

దిశ,ములుగు : ములుగు మండలం మల్లంపల్లి గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మల్లంపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు . కాగా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story