- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగళూరులో యాక్సిడెంట్.. నవ వరుడు మృతి, కోమాలో వధువు
దిశ, శేరిలింగంపల్లి: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆ దంపతులకు ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కలకాలం తోడుంటాడనుకున్న నవ వరుడ్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించగా.. పారాని ఆరకముందే ఆ వధువు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన పార్శి అన్నపూర్ణ, పార్శి మురళీకృష్ణ కుమారుడు శ్రీనివాస్ వివాహం ఈనెల 21న కనిమొళితో తిరుపతిలోని కోలయిగుట్టలో జరిగింది. వివాహం అనంతరం అత్తవారింటికి వెళ్తోన్న సమయంలో బెంగళూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నవ వధూవరులకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ వరుడు శ్రీనివాస్ మృతిచెందాడు. వధువు కనిమొళి కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీనివాస్ కారు వాహనం నడిపినట్లు సమాచారం. నూతన వధూవరులు ప్రమాదానికి గురవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.