- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగవేళ విషాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా
దిశ, గుడిహత్నూర్ : బస్సును కంటైనర్ లారీ ఢీ కొనడంతో బస్సు బోల్తా పడి పలువురికి గాయాలు అయిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ 44వ జాతీయ రహదారిపై బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల డిపో కు చెందిన బస్సు 30మంది ప్రయాణికులతో ఆదిలాబాద్ నుండి మంచిర్యాలకు వెళ్తుండగా గుడిహత్నూర్‌లో ప్రయాణికుల కోసం ఆగింది. బస్ స్టాండ్ వద్ద బయలుదేరే సమయంలో నిర్మల్ నుండి నాగపూర్ వైపునకు వెళ్తున్న హర్యానకు చెందిన కంటైనర్ లారీ వేగంగా ఢీ కొనడంతో బస్సు రోడ్డు పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆర్టీసి బస్సు డ్రైవర్‌తో పాటు 5గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బోల్తాపడిన బస్సును లేపి ప్రయాణికులను రక్షించారు. గాయాలపాలైన ప్రయాణికులను చికిత్స నిమిత్తం వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గతంలో ఇదే ప్రాంతంలో చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నపటికి జాతీయ రహదారి సంస్థకు చెందిన అధికారులు స్పందించడం లేదని , ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తే ప్రమాదాలు నివారించవచ్చని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం పై ఫిర్యాదు అందలేదని అందిన వెంటనే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్థానిక గుడిహత్నూర్ మండల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.