- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఆర్కే బయోగ్రఫీపై సర్కారు కుట్రలు’
దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) జీవిత చరిత్రను భావి తరాలకు తెలియకుండా ఉండేలా ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆయన భార్య శిరీష ఆరోపించారు. ఇటీవల చనిపోయిన ఆర్కే జీవిత చరిత్రను సాయుధ శాంతి స్వప్నం పేరుతో పుస్తకంగా ముద్రిస్తున్నామని, దాన్ని అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయన జీవిత విశేషాలను ప్రజలకు చేరకుండా చేసే కుట్రలకు పాల్పడుతున్నదని వ్యాఖ్యానించారు. పుస్తకాన్ని ముద్రిస్తున్న ప్రింటింగ్ ప్రెస్ మీద పోలీసులు దాడులు చేసి అప్పటికే సిద్ధంగా ఉన్న బుక్‌లతో పాటు ముద్రణా ప్రక్రియను నిలిపివేశారని, కంప్యూటర్‌ను, అందులోని హార్డ్ డిస్కును కూడా తీసుకెళ్ళిపోయారని పేర్కొన్నారు.
స్థానిక అంబర్‌పేట్‌లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ మీద పోలీసులు సోదాలు నిర్వహించి శుక్రవారం రాత్రి పుస్తకాలను తీసుకెళ్ళారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శిరీష శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పై ఆరోపణలు చేశారు. అనేక పత్రికల్లో, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే ఆయనకు సంబంధించిన అంశాలను సాయుధ శాంతి స్వప్నం పేరుతో పుస్తకం రూపంలో ప్రచురిస్తున్నామని, పోలీసులు మాత్రం మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నదనే పేరుతో అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. చివరకు ఈ పుస్తకాన్ని ప్రింట్ చేస్తున్న ప్రెస్‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని నిర్వాహకుల్లో ఒకరైన సంధ్య ఆరోపించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ జిల్లా కలెక్టర్ .. ? సోషల్ మీడియాలో పేరు వైరల్
- Tags
- Biography