అమాంతం పెరిగిన రిలయన్స్ షేర్ ధర!

by Anukaran |   ( Updated:2020-07-22 10:13:26.0  )
అమాంతం పెరిగిన రిలయన్స్ షేర్ ధర!
X

దిశ, వెబ్‌డెస్క్ :
దేశీయ దిగ్గజ ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర తొలిసారిగా రూ. 2000 రికార్డు స్థాయికి చేరుకుంది. బుధవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో కంపెనీ షేర్ ధర రూ. 1980 వద్ద ఉంది. తర్వాత సూచీలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ రిలయన్స్ షేర్ స్థిరంగా కొనసాగింది. దీంతో రిలయన్స్ షేర్ ధర కొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయికి చేరింది. రిలయన్స్ షేర్ ధర పెరగడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.7 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత సంవత్సరంలో రిలయన్స్ షేర్ ఏకంగా 32 శాతం ర్యాలీ చేసింది. అంతేకాకుండా ఈ ఏడాది మార్చి నెలలో కనిష్ఠ స్థాయి రూ. 867 నుంచి 130 శాతం లాభపడటం గమనార్హం. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ డైరెక్టర్ల సమావేశం ఈ నెల 24 నుంచి 30వ తేదీకి వాయిదా వేసినట్లు కంపెనీ ఎక్స్ఛేంజి వద్ద ప్రకటించింది. దీంతో, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి త్రైమాసిక ఫలితాలు జులై 30న వెలువడనున్నాయి.

Advertisement

Next Story