ఓటు హక్కును బాధ్యతగా భావించాలి !

by Shyam |
ఓటు హక్కును బాధ్యతగా భావించాలి !
X

దిశ, సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ భారతి హోలికేరీ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును … హక్కుగా మాత్రమే చూడకుండా బాధ్యతగా భావించాలన్నారు. ఈనెల 3న ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.

కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటరు స్లిప్‌ గుర్తింపునకు ప్రామాణికం కాదని అన్నారు. భారత్ ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదేని ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. పాస్‌పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వరంగ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులలో ఏదైనా వెంట తీసుకురావాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed