- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండు రూపాయల ట్రోల్స్ నన్ను ఫేమస్ చేశాయి : బాలీవుడ్ హీరోయిన్
దిశ, సినిమా : హీరోయిన్ రిచా చద్దాను నెటిజన్లు టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. కరెంట్ అఫైర్స్‌పై స్పందించే నటి చాలా సందర్భాల్లో ట్రోల్స్ ఎదుర్కోనగా.. తాను ఇలాంటివి పట్టించుకోవడం మానేశానని చెబుతోంది. ఒక విషయంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారంటే వారు భయపడుతున్నారని అర్థం. కానీ అలా భయపడాల్సిన అవసరం తనకు లేదని, కచ్చితంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తానని తెలిపింది. ‘అయితే ఇక్కడ రెండు రకాల ట్రోలర్స్ ఉన్నారు.
మన ఒపీనియన్ షేర్ చేసినప్పుడు నచ్చకపోతే ట్రోల్ చేసేవారు ఒక రకం కాగా.. కావాలనే ట్రోల్స్ చేసేందుకు నియమించబడినవారు మరోరకం. వాళ్లు రెండు రూపాయల ట్రోలర్స్ అన్నమాట. అయితే నిరుద్యోగులుగా ఉన్న వీరు కనీసం ఆ రెండు రూపాయలైన సంపాదించుకుంటున్నారని వదిలేస్తున్నాను. అసలు జరిగిన ఇన్సిడెంట్ మీద అవగాహన లేకపోయినా.. స్పెల్లింగ్ మిస్టేక్స్‌తో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేయడం వారికి అలవాటైపోయింది’ కానీ ఇలాంటి ట్రోల్స్ వల్లే తను ఫేమస్ అయ్యానని, ట్రోలర్స్ వారికి తెలియకుండానే ఎంతో హెల్ప్ చేశారని వివరించింది.