- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిగిలిన అన్నంతో వేడి వేడి పకోడి చేసుకోండిలా..!
X
దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో రోజూ అన్నం మిగిలిపోతుందా.. మిగిలిపోయిన రైస్‌ను ఇంట్లో ఎవరూ తినడం లేదా. ఫుడ్ వేస్ట్ అవుతుందని బాధ పడుతున్నారా.. ఇప్పుడు ఆ బాధ వద్దు.. ఇటువంటి వృథా ఫుడ్‌తో ఈజీగా వేడి వేడి పకోడిలు చేసుకోండి..
మిగిలిన అన్నంకు తోడుగా కావలసిన పదార్థాలు..
- ఉల్లిపాయలు
- పచ్చిమిర్చి
- కొత్తిమీర
- శనగపిండి ఒక కప్పు
- ఉప్పు సరిపడినంత
- కారం సరిపడినంత
- గరం మసాలా
- నూనె
తయారు చేసే విధానం..
అన్నం పకోడి తయారు చేసేందుకు ముదుగా ఒక బౌల్ తీసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక కప్పు అన్నం, ఒక కప్పు శనగపిండి సరిపడింనంత ఉప్పు, కారం, గరం మసాల వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని మెత్తగా కలుపుకొని 2 నిమిషాలు పక్కకు పెట్టాలి.
అనంతరం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె మరిగిన తర్వాత.. ముందుగా కలిపి పెట్టుకున్న పకోడి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని నూనెలో వెయ్యాలి. అవి కొంత మాగిన తర్వాత.. బంగారు రంగులోకి వచ్చాక తీయ్యాలి. అంతే.. వేడి వేడి అన్నం పకోడి రేడీ.. వీటికి పల్లి చెట్నీ తోడైతే ఆ రుచే వేరు…!
Advertisement
Next Story