వర్మ అరాచకం.. ఇంటర్వ్యూ కి వచ్చిన యాంకర్ ని ఆ యాంగిల్ లో..

by Anukaran |   ( Updated:2023-08-18 16:00:53.0  )
వర్మ అరాచకం.. ఇంటర్వ్యూ కి వచ్చిన యాంకర్ ని ఆ యాంగిల్ లో..
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ సృష్టించినన్నీ వివాదాలు మరెవరు సృష్టించలేరేమో. ఒక నార్మల్ అమ్మాయిని స్టార్ గా మార్చాలన్నా.. ఒక స్టార్ హీరోను దుమ్మెత్తిపోయాలన్నా ఆయనికే చెల్లింది. ప్రేమ, పెళ్లి అనే మాటలు కాకుండా జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేది వర్మను చూసే నేర్చుకోవాలేమో.. ఇక ఇప్పటికే ఈ వివాదస్పద దర్శుకుడి కంట్లోపడి ఒక సాధారణ యాంకర్ గా ఉన్న అరియనా గ్లోరీ బిగ్ బాస్ వరకు వెళ్లి ప్రస్తుతం స్టార్ డమ్ ని అనుభవిస్తోంది. ఇక అరియనా లక్ ని చూసిన మిగతా యాంకర్లు కూడా వర్మ కంట్లో పడడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. తాజాగా టిక్ టాక్ తో జూనియర్ సమంత అని పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి కూడా అదే పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తోంది.

ఇటీవల వర్మను ఇంటర్వ్యూ చేయడానికి చిట్టి పొట్టి బట్టలు వేసుకొని వర్మ దగ్గరకు వెళ్లిన ఈ చిన్నది.. ఆయనతో కాస్తా బోల్డ్ గానే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక వర్మ సంగతి తెలిసిందే కదా.. అందమైన అమ్మాయి కనిపిస్తే ఆయనలో దాగి ఉన్న కళాకారుడు బయటికి వచ్చేస్తాడు. హాట్ బ్లూ డ్రెస్ లో అషూ ని చుసిన వర్మ ఫోటోగ్రాఫర్ గా మారిపోయాడు. ఎక్కడలేని యాంగిల్స్ ని కనిపెట్టి మరి అమ్మడు అందాలను కెమెరాలో బంధించాడు. దీనికి సంబంధించిన వీడియోను అషూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారి విమర్శలకు దారి తీసింది. ఆ వీడియోలో అషురెడ్డి ధరించిన దుస్తులు.. ఆమె చేస్తున్న ఎక్స్‌పోజింగ్.. రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదెక్కడి బ్లోడ్ యాంగిల్ రా మావా.. అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, వర్మ ఏమైనా యాంగిల్ పెట్టావా..? ఏది చేసినా నీలాగే చేయాలి అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి, ఫేమస్ అవ్వడానికి యాంకర్లు ఇలాంటి పనులు చేయడం పద్ధతేనా అని మరికొందరు చురకలు అంటిస్తున్నారు. అంటే.. వర్మ వద్ద అందాల ప్రదర్శన చేస్తే ఆయన రెచ్చిపోయి మాట్లాడితే వైరల్ అయ్యి ఛాన్స్ లు కొట్టేయడానికి ఇలాంటి ప్లాన్ వేస్తున్నారు కొందరు అన్నట్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ కామెంట్స్ కి అషూ రెడ్డి స్పందిస్తూ లైట్‌గా తీసుకొని వెటకారంగా ఉండే ఎమోజీని జతచేస్తూ ‘మీ కామెంట్స్‌కు థ్యాంక్స్’ అని రిప్లై ఇచ్చింది. మరి ఈ అమ్మడు కూడా వర్మ పుణ్యమా అని స్టార్ గా మారిద్దేమో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed