- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తం సల సల మరుగుతోంది.. ఇంద్రవెల్లి గడ్డ మీద రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకేళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోంది అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి వేదికగా దళిత దండోరా కార్యక్రమంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప్పెనలా కార్యకర్తలు, గిరిజనులు, ఆదివాసీలు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అటువంటి వారిని విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ కోసం అమరులైన ఆదివాసీ బిడ్డల పేర్లను స్మారక శిలాఫలకంపై లిఖిస్తామన్నారు. (రేవంత్ రెడ్డి స్పీచ్ వీడియో కింద ఉంది చూడవచ్చు)
ఆదిలాబాద్ అంటే ఇదేనా..
ఒకప్పుడు ఉద్యమాలకు పురిటిగడ్డగా పేరొందని ఆదిలాబాద్.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జోకుడు రామన్నలు, గుడిలోని లింగాలను మింగే ఇంద్రకరణ్ రెడ్లు అంటూ ఎద్దేవా చేశారు. బానిస బతుకు బతుకుతున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమాన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వారు జిల్లాకు అరిష్టంగా మారారు అంటూ రేవంత్ రెడ్డి చురకలు వేశారు. కానీ, గతం నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులకు ఎంతో చేసిందని.. అత్యన్నత పదవులు అప్పగించిందని గుర్తు చేశారు. బాల్క సుమన్ లాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీలకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని.. అదే రిజర్వేషన్ పేరు మీద ఎమ్మెల్యే, ఎంపీగా నిలబడ్డ ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అటువంటి రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతోందన్నారు.
Read more:
దరిద్రుడు కేసీఆర్.. దళితులను ఓర్వడు: రేవంత్ రెడ్డి
- Tags
- Indravelli