- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ
దిశ, వెబ్ డెస్క్:
వరద సాయం గోల్‌మాల్‌పై సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ‘గ్రేటర్‌లో వరద సాయాన్ని గులాబీ పార్టీ నాయకులు స్వాహా చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. శవాలపై పేలాలను ఏరుకున్న మాదిరిగా వరద బాధితుల సహాయంలోనూ కమినష్లను దండుకున్నారని ఆయన అన్నారు. మీ పార్టీ కార్పొరేటర్లను, నాయకులను చూస్తుంటే వీళ్లు మనుషులేనా అన్న అనుమానం వస్తోందన్నారు. అసలు వాళ్లకు మానవత్వం ఉందా అని అనిపిస్తోందని ఆయన లేఖలో రాశారు. గ్రేటర్‌లో ఓట్లను దండుకోవాలన్న మీ దుర్భుద్ధేశ్యమే దీనికి కారణమని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేసేవారని ఆయన అన్నారు. ప్రభుత్వ అత్యుత్సాహం వల్లే పరిహారాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. తిరిగి రెండు రోజుల్లో పరిహారం పంపిణీని మొదలు పెట్టాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జరిగిన దోపిడీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.