- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఏజెంట్‌గా కేసీఆర్.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ నకిలీ లౌకిక వాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మత శక్తులను ఓడించడానికి మైనార్టీలంతా కాంగ్రెస్‌తో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో మైనార్టీలంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శనివారం జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మైనారిటీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈనెల 7న గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోయే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను చేరదీసిందని బీజేపీ ఆరోపిస్తూ ఎన్నికల్లో ప్రజల్ని విభజించిందని ఆరోపించారు. అయితే ముస్లింలు మాత్రం టీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారని, తర్వాత జాతీయ స్థాయిలో తిరిగి బీజేపీకి అనుకూలంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఈ ధోరణి భారత లౌకికత్వానికి అధిక నష్టాన్ని కలిగించిందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఒక సమాజాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేయలేదన్నారు. వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వడంతో మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందనివెల్లడించారు.
సీఎం కేసీఆర్, బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీల ఏజెంట్ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ మైనారిటీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, మైనార్టీలకు వ్యతిరేకమైన అనేక అంశాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ బిల్లులో టీఆర్‌ఎస్ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని, పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌లను టీఆర్‌ఎస్ వ్యతిరేకించలేదని చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ పదేపదే డిమాండ్ చేసినప్పటికీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీల్లో తీర్మానాలు చేయలేదని గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు రెండూ రాజకీయ వైరం ఉన్నట్లుగా నటించి తెలంగాణ ప్రజలను మోసం చేసి తప్పుదారి పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు.