కనీవినీ ఎరుగని ఉద్యమం చేస్తా : రేవంత్

by Anukaran |   ( Updated:2020-09-11 05:18:44.0  )
కనీవినీ ఎరుగని ఉద్యమం చేస్తా : రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్, సీఎం అయ్యాక నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ సమీపంలో నాగులు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘నాగులు ఆత్మహత్యాయత్నం ఉద్యమ కాల ఆత్మబలిదానాలను గుర్తుకు తెచ్చింది. నాగులు ఆర్తనాదాలలో తెలంగాణ నిరుద్యోగ యువత గుండె చప్పుడు ఉంది.

‘కేసీఆర్ కనికరం లేని ముఖ్యమంత్రి అని అన్నారు. ఉద్యమంలో నిరుద్యోగ యువత శవాల వద్ద కేసీఆర్ కార్చింది కన్నీరా… ముసలి కన్నీరా?. కేసీఆర్ తీరుతో బలిదానాలు చేసుకున్న యువత ఆత్మలు ఘోషిస్తున్నాయి. కేటీఆర్ సూటూబూటూ వేసుకుని బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ఫోటోలు దిగితే ఉద్యోగాలు వచ్చినట్టేనా?. కేసీఆర్ హామీలు మీడియాలో హెడ్ లైన్స్ వచ్చాయి తప్ప… యువతకు ఉద్యోగాలు రాలేదు. నాగులుకు మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందించాలి. ఉపాధికి హామీ ఇవ్వాలి. నిరుద్యోగ సమస్యపై తక్షణ కార్యాచరణ ప్రకటించాలి. కేసీఆర్ స్పందించకుంటే… నిరుద్యోగ యువత తరపున త్వరలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్యమం చేస్తా’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed