- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. కొడుకును కాల్చిన రిటైర్డ్ ఎస్సై
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: ఓ రిటైర్డ్ ఎస్సై తన కొడుకును కాల్చి, ఆ తర్వాత తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీస్ కమిషనర్ విశాల్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకు చెందిన బచన్ సింగ్(65) అనే రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ తన కొడుకుపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం అదే రివల్వార్ తో తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దాద్రి ప్రాంతంలో ఉన్న రైల్వే రోడ్ సమీపంలోని ఎస్కార్ట్ కాలనీలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, బచన్ సింగ్ కొడుకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సీపీ తెలిపారు. కుటుంబ కలహాలతో తన కొడుకుపై బచన్ సింగ్ కాల్పులు జరిపారని సీపీ వెల్లడించారు.
Advertisement
Next Story