- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
13 ఏళ్ల బాలికపై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నం..
దిశ ప్రతినిధి, వరంగల్ : హన్మకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదమూడేళ్ల బాలికపై 65 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని వడ్డెపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. విద్యాశాఖలో ఉన్నతమైన హోదాలో పనిచేసిన భిక్షపతి అనే వ్యక్తి పరిమళ కాలనీ రోడ్ నెంబర్ -8లో నివాసముంటున్నాడు. ఈయన ఇంటికి ఆనుకునే అద్దె ఇంట్లో ఓ దివ్యాంగుడు, అతని కూతురుతో కలసి ఉంటున్నాడు. భార్యభర్తల మధ్య కలహాలు రావడంతో కొద్దిరోజులుగా భార్య దూరంగా ఉంటోంది. బాలిక తండ్రి ఓ హోటల్‌లో పనిచేసేవాడు.
కరోనా నేపథ్యంలో నష్టాలు రావడంతో పనిలో నుంచి అతన్ని తీసేశారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న వ్యక్తి.. తన భార్య కాపురానికి రావడం లేదనే మనోవేదన చెందుతున్నాడు. బాలిక ఆలనాపాలన చూసేవారు లేకపోయారు. ఈ క్రమంలోనే బాలికపై కన్నేసిన భిక్షపతి ఏదో పని ఉందని ఇంట్లోకి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగోలా బాలిక తప్పించుకుని ఈ విషయాన్ని తండ్రికి వివరించింది. దీంతో తండ్రి బంధువులతో కలసి మంగళవారం మధ్యాహ్నం 100కు కాల్ చేశారు. వారికి అసలు విషయం తెలపగా.. కేయూ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.