- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘రాజీనామా ఒక ఆప్షన్ మాత్రమే’
ముంబయి: హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ నుంచి రాజీనామా కోరడం కేవలం ఒక ఆప్షన్ మాత్రమేననీ.. తుది నిర్ణయం మాత్రం సీఎం ఉద్దవ్ చేతుల్లోనే ఉంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. అనిల్ రాజీనామాతో పాటు మరేదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నా వాటిపైనే చర్చిస్తామని ఆయన తెలిపారు. పరంబీర్ సింగ్ తనను కలిశాడని చెప్పారు. తనను ట్రాన్స్ ఫర్ చేయడం అన్యాయమని పరంబీర్ సింగ్ తనతో అన్నారని శరద్ పవార్ చెప్పారు. ఈ విషయంలో రాజకీయ హస్తాలు ఉన్నట్టు కనిపిస్తోందని చెప్పారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు తమ పార్టీ కర్తలతో తాను సమావేశం అవుతానని వెల్లడించారు. ఈ విషయంలో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో ఇప్పటి వరకు చర్చించలేదని తెలిపారు. కేవలం సీఎం ఉద్దవ్ థాక్రెతో మాత్రమె మాట్లాడానని పేర్కొన్నారు.
కాగా ఆరోపణల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరపించాలన్నారు. ఈ కేసులో వాస్తవాలను వెలికితీయాలని అన్నారు. ఈ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి జూలియో రబిరో సహాయం తీసుకుంటే బాగుంటుందని సీఎం ఉద్దవ్ థాక్రెకు సూచించారు. ఈ విషయంలో సీఎం ఉద్దవ్ థాక్రెను తాను కలుస్తానని.. దీనిపై పూర్తి స్థాయిలో చర్చిస్తానని చెప్పారు.