బ్యాకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై IMPS ద్వారా రూ.5 లక్షలు బదిలీ చేయొచ్చు

by Harish |   ( Updated:2021-10-08 04:02:28.0  )
బ్యాకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై IMPS ద్వారా రూ.5 లక్షలు బదిలీ చేయొచ్చు
X

దిశ, డైనమిక్ బ్యూరో : బ్యాంకింగ్ లావాదేవీలు చేసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్ చెల్లింపులు,నగదు బదిలీ చేసేందుకు వినియోగించే IMPS ట్రాన్సాక్షన్స్ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ IMPS ద్వారా కేవలం రూ.2 లక్షల నగదు మాత్రమే బదిలీ చేయొచ్చు. అయితే, ఆర్బీఐ నిర్ణయంతో రూ. 5 లక్షల వరకూ పంపవచ్చు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 2014 లో రూ.2 లక్షల నగదు బదిలీ పరిమితిని తీసుకొచ్చిన ఆర్బీఐ ఇన్నేళ్లకు ఇప్పుడే దీనిని రూ.5 లక్షలకు సవరించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అయితే, బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఒక అకౌంట్‌ నుంచి మరో అకౌంట్‌కు క్షణాల్లో డబ్బు పంపించేందుకు IMPS ను ఉపయోగిస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed