- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కలు నాటిన రేణు దేశాయ్
దిశ, న్యూస్ బ్యూరో: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి రేణు దేశాయ్ తన కూతురుతో కలిసి శుక్రవారం మొక్కలు నాటారు. ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.. జీవన విధానంలో మనందరం అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడ్డామని, చిన్నతనంలో సొంత గృహాల్లో ఉండడం వల్ల ఆ చుట్టు పక్కల మొక్కలు పెంచేవాళ్లన్నారు. కానీ, ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలో, ఎలా పెంచాలో తెలియడం లేదన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు నా కూతురు ఆద్య, కూతురు స్నేహితురాలు యషిక ఇద్దరినీ నేను ఇక్కడికి తీసుకొచ్చానని, మొక్కలను ఏ విధంగా నాటాలి.. వాటి వల్ల ఉపయోగం ఏమిటన్న విషయాన్ని తెలపటం కోసం వాళ్లద్దరిని తీసుకొచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్ తరాలకు 15 సంవత్సరాల తర్వాత ఉపయోగం ఉంటుందన్నారు. ఆ ఫలాలను భవిష్యత్ తరాలవారు అందుకుంటారని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన జోగినిపల్లి సంతోష్ కు అభినందనలు తెలిపారు. తాను ముగ్గురికి చాలెంజ్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.