- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం తొలగింపు.. ఆందోళనలు ఉధృతం
by Shyam |
X
దిశ, ఎల్‌బీనగర్ : హయత్‌నగర్ బస్‌స్టాఫ్ వద్ద ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని తొలగించడంపై తీవ్ర వివాదం చెలరేగింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపాన్ని నిర్వహించేందుకు బుధవారం రాత్రి లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని స్థానిక యువకులు తొలగించి వేరే స్థానంలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హయత్ నగర్ పద్మశాలి సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని యథాస్థానంలో నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనలు ఉధృతం కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న హయత్ నగర్ సీఐ.. బాపూజీ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్టించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా నిర్వహిస్తున్న పద్మశాలి సంఘం ప్రతినిధులు ఆందోళన విరమించుకున్నారు.
Advertisement
Next Story