అప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్…ఇప్పుడు రెమ్డేసివిర్

by vinod kumar |
అప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్…ఇప్పుడు రెమ్డేసివిర్
X

దిశ, వెబ్‌డెస్క్:
కొవిడ్ 19 ప్రారంభ క్లినికల్ ట్రయల్స్‌లో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపశమనం కలిగిస్తుందని అమెరికా వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రెమ్డేసివిర్ అనే డ్రగ్ కూడా కొవిడ్ 19 మీద మరింత ప్రభావవంతంగా పనిచేస్తోందని అమెరికా సాంక్రమిక వ్యాధుల విభాగ అధికారి వెల్లడించారు. నిజానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ కంటే బాగా ఇది పనిచేస్తోందని అన్నారు.

జిలీడ్ సైన్సెస్ ఐఎన్‌సీ వారి ప్రయోగాత్మక డ్రగ్ రెమ్డేవిసిర్‌ కొవిడ్ 19 నియంత్రణకు ప్రమాణిక మందుగా వాడొచ్చని డాక్టర్ ఆంథోనీ ఫాసీ అన్నారు. అమెరికా ప్రభుత్వం చేస్తున్న ట్రయల్స్‌లో ఈ మందు వాడినపుడు 31 శాతం వేగంగా పేషెంట్లు కోలుకున్నారని ఆయన చెప్పారు. మొత్తంగా 1063 పేషెంట్ల మీద ఈ డ్రగ్ ప్రయోగిస్తే వీరందరూ 11 రోజుల్లో కోలుకున్నారు. రెగ్యులర్ ట్రీట్‌మెంట్ ద్వారా కొవిడ్ 19 పేషెంట్లు కోలుకోవడానికి 15 రోజులు పట్టేది. దీంతో ఇప్పటికే ఈ మందు ఉత్పత్తులను పెంచి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు జిలీడ్ సంస్థకు ఆదేశాలు కూడా ఇచ్చిందని ఆంథోనీ చెప్పారు.

ఈ ప్రకటనతో జిలీడ్ సంస్థ షేర్ ధర బుధవారం రోజున 5 శాతం పెరిగింది. ఈ సంవత్సరం మొత్తం పెరుగుదలతో చూస్తే 27 శాతం పెరిగింది. కొవిడ్ 19 నివారణకు సరైన మందు లేకపోవడంతో సకారాత్మక ప్రభావాలు చూపించిన మందునే ఎక్కువగా వాడి వ్యాధి వ్యాప్తి వీలైనంత మేరకు కట్టడి చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇదే రెమ్డేసివిర్ మందును ఎబోలా వ్యాధి ట్రీట్‌మెంట్ కోసం తయారుచేసిన సంగతి తెలిసిందే.

Tags: corona, covid 19, hydroxychloroquine, Remdesivir, Ebola, US, drug, Gilead

Advertisement

Next Story

Most Viewed