- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిలయన్స్ చేతికి మిల్క్‌బాస్కెట్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈ-కామర్స్ రంగంలో పోటీ తీవ్రమవుతోంది. ఇటీవలే దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలో పట్టు కోసం స్టార్టప్ కంపెనీ బిగ్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో దిగ్గజ సంస్థ రిలయన్స్ కిరాణా, మిల్క్ స్టార్టప్ మిల్క్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రిలయన్స్-మిల్క్‌బాస్కెట్ కంపెనీల మధ్య గతేడాది నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒప్పందం చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం. ఇదివరకు వాటాదారుల అభిప్రాయబేధాలతో ఈ ఒప్పందం నిలిచిపోయింది.
మళ్లీ ఇప్పుడు ఒప్పందం పట్టాలెక్కినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం..వాటాదారులు కొత్త నిబంధనలు, షరతులకు అంగీకరించారు. ఇరు కంపెనీలు ఒప్పందాన్ని ఆమోదించాయి. మరికొద్ది వారాల్లో అగ్రీమెంట్ పూర్తవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా తెలియనప్పటికీ, అంతర్గత నివేదికల ప్రకారం.. రిలయన్స్ సంస్థ 100 శాతం వాటా కోసం మిల్క్‌బాస్కెట్‌కు సుమారు రూ. 290 కోట్లు చెల్లించనుంది. కాగా, మిల్క్‌బాస్కెట్ దాదాపు 1.3 లక్షల వినియోగదారులతో బలమైన నెట్‌వర్క్ కలిగి ఉంది. తన ప్లాట్‌ఫామ్‌లో 9 వేల బ్రాండ్లను విక్రయిస్తోంది.