రిలయన్స్ రిటైల్ ఖాతాలోకి జస్ట్ డయల్ సంస్థ..

by Harish |
just-dail
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద రిటైల్ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెబీ నిబంధనల ప్రకారం.. 25 ఏళ్ల అనుభవం ఉన్న పముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ జస్ట్ డయల్‌లో పూర్తి నియంత్రణను తీసుకున్నట్టు గురువారం వెల్లడించింది. దీనికి సంబంధించి బాధ్యతలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో వెల్లడించిన దాని ప్రకారం.. సంస్థ వృద్ధిని కొనసాగించేందుకు జస్ట్ డయల్ వ్యవస్థాపకుడు వీ ఎస్ ఎస్ మణి సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని రిలయన్స్ రిటైల్ స్పష్టం చేసింది.

రిలయన్స్ రిటైల్, జస్ట్ డయల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. మొత్తం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో దానికి రూ. 1,022.25 చొప్పున రిలయన్స్ రిటైల్‌కు కేటాయించబడుతుంది. అదేవిధంగా వీ ఎస్ ఎస్ మణికి చెందిన ఒక్కో షేర్‌కు రూ. 1,020తో మొత్తం 1.31 కోట్ల షేర్లను రిలయన్స్ రిటైల్ దక్కించుకుంది. కాగా, జస్ట్ డయల్ సంస్థ భారత్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్

Advertisement

Next Story

Most Viewed