రిలయన్స్ సొంతమైన అర్బన్ ల్యాడర్

by Harish |
రిలయన్స్ సొంతమైన అర్బన్ ల్యాడర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్‌వీఎల్) తాజాగా ఆన్‌లైన్ ఫర్నిచర్ స్టార్టప్ అర్బన్ ల్యాడర్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. 96 శాతం వాటాను చేజిక్కించుకున్న ఆర్ఆర్‌వీఎల్ మొత్తం రూ. 182.12 కోట్లతో ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో ఆర్ఆర్‌వీఎల్ పూర్తిగా వంద శాతం అర్బన్ ల్యాడర్ వాటాను కొనుగోలు చేసే అవకాశముంది.

అలా జరిగితే అర్బన్ ల్యాడర్ ఆర్ఆర్‌వీఎల్ అనుబంధ సంస్థగా మారిపోనుంది. 2023 నాటికి రిలయన్స్ సంస్థ అర్బన్ ల్యాడర్‌లో అదనంగా మరో రూ. 75 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు వెల్లడించింది. డిజిటల్ వినియోగం పెంచడం, తద్వారా వినియోగదారులకు మరింత చేరువవ్వాలని భావిస్తోంది. కాగా, అర్బన్ ల్యాడర్ స్టార్టప్ సంస్థ 2012లో ప్రారంభమైంది. ఆన్‌లైన్ ఫర్నీచర్ వ్యాపారంలో ఈ సంస్థ తక్కువ సమయంలో విస్తరించింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో రిటైల్ స్టోర్లను కూడా కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed