- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపావళికి జియో బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో మొబైల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది దీపావళి పండుగ సీజన్ కోసం ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే మార్కెట్లోకి రానున్న జియో ఫోన్‌నెక్స్ట్ గురించి రిలయన్స్ సంస్థ కీలక వివరాలను ప్రకటించింది. సోమవారం ‘మేకింగ్ ఆఫ్ జియోఫోన్ నెక్స్ట్’ పేరుతో దీనికి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్ వివరాలను వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్ ఆండ్రాయిడ్‌కి ఇప్పటికీ తిరుగులేదు. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ ఆండ్రాయిడ్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పటికే శాంసంగ్, వన్‌ప్లస్, హువావే సంస్థలు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లను అభివృద్ధి చేసినప్పటికీ విజయవంతంగా కొనసాగలేకపోయాయి.
ఈ నేపథ్యంలో జియో సంస్థ మొదటిసారిగా ‘జియో ఫోన్ నెక్స్ట్’లో ‘ప్రగతి ఓఎస్’ పేరుతో తీసుకురానుంది. జియో ఫోన్‌ను ప్రతి ఒక్కరూ వాడటం ద్వారా అందరూ ప్రగతి సాధించాలనే సదుద్దేశంతో ఈ పేరును ఖరారు చేసినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సరికొత్త ఫోన్‌లో కనెక్టివిటె సమస్యలనేవి లేకుండా క్వాల్కమ్ ప్రాసెసర్‌తో పాటు, ఈజీ-స్మార్ట్ కెమెరా, వాయిస్ అసిస్టెంట్, ఆడియో బ్యాటరీలలో ఆప్టిమైజేషన్‌లు, మెరుగైన లొకేషన్ టెక్నాలజీలను అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది. అంతేకాకుండా ఆటోమెటిక్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ సౌకర్యం ఉండనుంది. జియోఫోన్ నెక్స్ట్ దేశంలోని ప్రతి భారతీయుడికి సమాన డిజిటల్ టెక్నాలజీ అందించే విధంగా ఉంటుందని రిలయన్స్ జియో తెలిపింది.