- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో సంస్థను సొంతం చేసుకున్న రిలయన్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మరో సంస్థను సొంతం చేసుకుంది. ప్రముఖ హోల్‌సేల్ సంస్థ యాక్టొసెర్బా యాక్టివ్‌లో మైనారిటీ వాటాను దక్కించుకోవడం ద్వారా ఆన్‌లైన్ లోదుస్తుల కంపెనీ జివామేను సొంతం చేసుకున్నట్టు సోమవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. దీనికి సంబంధించిన లావాదేవీలు సెప్టెంబర్ 30తో ముగిసిన మొదటి అర్ధ సంవత్సరంలో ముగిసిందని పేర్కొంది.
యాక్టొసెర్బా యాక్టివ్ హోల్‌సేల్‌ను అనుబంధ సంస్థగా రిలయన్స్ వెల్లడించగా, ఇప్పటివరకు రిలయన్స్‌కు అనుబంధంగా ఉన్న కంపెనీల సంఖ్య 38కి చేరింది. మార్కెట్ రెగ్యులేటరీ ఇచ్చిన వివరల ప్రకారం..రిలయన్స్ సంస్థ యాక్టొసెర్బా యాక్టివ్్‌లో 15 శాతం వాటాను కొనుగోలు చేసింది. కాగా, బెంగళూరుకు చెందిన యాక్టొసెర్బా యాక్టివ్ హోల్‌సేల్ 2011లో స్థాపించబడింది. అయితే, ఈ సంస్థ జివామే పేరుతోనే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ఈ సంస్థ మహిళల కోసం ఆన్‌లైన్ లోదుస్తుల స్టోర్‌ను నిర్వహిస్తోంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 30కి పైగా రిటైల్ దుకాణాలను, 800కి పైగా భాగస్వామ్య దుకాణాలను కలిగి ఉంది. 2019 ఏడాది మార్చి నాటికి కంపెనీ ఆదాయం రూ. 140 కోట్లుగా వెల్లడించింది. అలాగే, అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే మెరుగ్గా 19.5 కోట్ల నికర నష్టాలను కంపెనీ నమోదు చేసింది.