ఏపీలో వద్దన్న రిలయన్స్.. జగన్‌ సర్కార్‌కు షాకిచ్చిన అంబానీ..!

by Anukaran |
ఏపీలో వద్దన్న రిలయన్స్.. జగన్‌ సర్కార్‌కు షాకిచ్చిన అంబానీ..!
X

దిశ, ఏపీ‌బ్యూరో: ఏపీలో కంపెనీ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ విముఖత చూపింది. మూడేళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన 136 ఎకరాల భూమిని ప్రభుత్వానికి తిరిగిచ్చేసింది. అయితే వేరే ప్రాంతంలో భూములు ఇస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించినప్పటికీ రిలయన్స్ సంస్థ ప్రతినిధులు మాత్రం స్పందించడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి రిలయన్స్ సంస్థ తరలిస్తుందన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తిరుపతి సమీపంలో సెట్‌టాప్‌ బాక్సులు, ఇంటర్నెట్‌ వినియోగానికి అవసరమైన డాంగిల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గతంలో రిలయన్స్ సంస్థకు ప్రభుత్వం 136 ఎకరాల భూమి కేటాయించింది.ఆ భూమిలో 50 ఎకరాలు వివాదంలో ఉండటంతో 15 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులు పరిష్కారం అయ్యేవరకు యూనిట్ ప్రారంభించడానికి అవకాశం లేకపోవడంతో రిలయన్స్ తాము తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేసింది. అయితే తిరుపతికి సమీపంలోని వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించారు.

అయితే ఆ ప్రతిపాదనపై సంస్థ ప్రతినిధుల స్పందించడం లేదు. దీంతో రిలయన్స్ కంపెనీ తమ ప్రాజెక్టును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి తరలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రిలయన్స్ సంస్థ భూములు వెన్నక్కు ఇచ్చిన విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. అలాగే భూముల కోసం రిలయన్స్ సంస్థ చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed