- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పీఆర్సీ జీవోలు విడుదల.. హెచ్ఆర్ఏ ఎంతంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై జీవోలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి ఈ జీవోలను జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ను వర్తింపచేస్తున్నారు. ఇక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొంత నిరాశే ఎదురైంది. వేతన సవరణ కమిషన్ సూచించిన ప్రకారం కనీస వేతనాలు రూ. 19వేలను అమలు చేస్తారని భావించారు. కానీ ఇప్పుడు ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంచారు. దీంతో రూ. 3 వేల చొప్పున వేతనాలు పెరిగాయి. దీంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనాలకు కూడా దూరంగానే ఉన్నారు.
అదే విధంగా హెచ్ఆర్ఏను పీఆర్సీ కమిషన్ సూచించిన మేరకు ఖరారు చేశారు. సెంట్రల్ పీఆర్సీ నివేదిక ప్రకారమే నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో 24 శాతం హెచ్ఆర్ఏ ఉండగా… కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్ పరిధిలో 17 శాతం, 50 వేలకుపైగా 2 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 13 శాతం, 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో 11 శాతం హెచ్ఆర్ఏను ఖరారు చేశారు. పీఆర్సీకి సంబంధించిన జీవోలన్నీ విడుదలయ్యాయి.
పీఆర్‌సీ జీవో కాపీల కోసం ఈ కింది నంబర్లను క్లిక్ చేయండి..