- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
26 శాతం పెరిగిన కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు..
దిశ, వెబ్‌డెస్క్ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీలు 26 శాతం పెరిగి 1.55 లక్షలకు చేరుకున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. కంపెనీల చట్టం కింద గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో తక్కువగా 3,209 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అయితే, 2021 మార్చిలో ఇది అత్యధికంగా 17,324 కొత్త కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు రూబిక్స్ డేటా సైనెస్ సంస్థ వెల్లడించింది. 2020-21లో మొత్తం 1,55,377 కొత్త కంపెనీలు నమోదయ్యాయి. ఇది అంతకుముందు 2019-20లో నమోదైన 1,22,721 కంటే 26 శాతం ఎక్కువ.
ఈ ఏడాది ప్రారంభంలో కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ కంపెనీల రిజిస్ట్రేషన్ రికార్డు స్థాయిలో పెరగడం గమనార్హం అని రూబిక్స్ సంస్థ తెలిపింది. రూబిక్స్ డేటా సైన్సెస్ సంస్థ టెక్, అనలిటిక్స్ ఆధారిత బిజినెస్-టూ-బిజినెస్ రిస్క్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ ప్లాట్‌ఫామ్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ నివేదిక ప్రకారం.. తయారీ రంగంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీల సంఖ్య 2019-20లో 23,014 నమోదవగా, 2020-21లో ఏకంగా 33,483 రిజిస్ట్రేషన్లతో 45 శాతం పెరిగాయి. సేవల రంగంలో రిజిస్ట్రేషన్లు 16 శాతం పెరగ్గా, అధికంగా వ్యవసాయ, దాని అనుబంధ కార్యకలాపాల్లో కొత్త కంపెనీల సంఖ్య 112 శాతం వృద్ధి నమోదైంది.