- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘మాడ్రిడ్ ఓపెన్ రద్దు చేయండి’
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా మరో టెన్నిస్ టోర్నీ రద్దు కాబోతున్నది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే టెన్నిస్ టోర్నీని రద్దు చేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించిది. ఈ ఏడాది మేలో నిర్వహించాల్సిన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా సెప్టెంబర్ 12 నుంచి 20కి వాయిదా వేస్తున్నట్లు గతంతో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికీ వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ఈ టోర్నమెంట్‌ను పూర్తిగా రద్దు చేయాలని మాడ్రిడ్ నగర పాలకులు నిర్వాహకులను ఆదేశించారు. ఈ మేరకు తమకు ఆదేశాలు జారీ అయినట్లు నిర్వాహకులు శనివారం వెల్లడించారు. కాగా, కరోనా ప్రభావం తగ్గుతుందని గతంలో ఈ టోర్నీని మే నుంచి సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. కానీ ఇప్పటికీ స్పెయిన్‌లో పరిస్థితులు కుదుటపడలేదు. నిత్యం 2వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే స్పెయిన్ వ్యాప్తంగా 2.8లక్షల కేసులు నమోదయ్యాయి. అందుకే ఈ సారి టోర్నీని రద్దు చేయాలని స్థానిక ప్రభుత్వం సూచించింది. యూఎస్ ఓపెన్ ఫైనల్ జరిగే రోజే ఈ టోర్నీ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పుడు మాడ్రిడ్ స్థానిక ప్రభుత్వ ఆదేశంతో టోర్నీ సందిగ్దంలో పడింది.