- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్వారీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ..
దిశ, కంది: స్టోన్ అండ్ మెటల్ క్వారీ ఏర్పాటు కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం కంది మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 157 లో రాక్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే క్వారీ కోసం ప్రజల నుంచి అభిప్రాయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి ష సేకరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. క్వారీ ఏర్పాటుతో ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేలా చూడాలన్నారు.
అదే విధంగా బ్లాస్టింగ్ చేసేటప్పుడు దుమ్ము ధూళి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక డీఎస్పీ బాలాజీ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి సురేష్ కుమార్, సంస్థ ప్రతినిధి రఘువరన్, జెడ్పీటీసీ కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.