ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం.. వీళ్లకు మాత్రమే అవకాశం

by Anukaran |   ( Updated:2021-07-14 05:09:25.0  )
we are hiring
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న IOCL ఆఫీసుల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే నియామక ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది. గేట్-2021 స్కోరు ఆధారంగా ఇంజినీర్లు, ఆఫీసర్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లను నియమించుకోనుంది. కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్​స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్‌లో వెల్లడించింది ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.

ఎంపిక విధానం:

step 1 2021-గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్
step-2 గ్రూప్ డిస్కషన్
step-3 గ్రూప్ టాస్క్
step-4 పర్సనల్ ఇంటర్‌వ్యూలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటామని IOCL స్పష్టం చేసింది.

అప్లై చేసుకోవడానికి చివరి తేదీ –జూలై 26
అర్హత: గేట్-2021లో క్వాలిఫై అయిన వారు మాత్రమే అర్హులు.
గమనిక: 2021కి ముందు, గతంలో మెరీట్ స్కోర్ సాధించిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకోరు.

ఇప్పుడే అప్లే చేసుకోవడానికి ఈ క్రింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి..
https://ioclapply.com/NewRegistration_1004.aspx?ApplyOnline=4

Advertisement

Next Story