- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొడుకు చేసిన పనికి దారుణ హత్యకు గురైన తండ్రి

దిశ, అచ్చంపేట : కొడుకు చేసిన పనికి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్య (55) కుమారుడు ఇటీవల అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను చిన్న కుమారుడు తీసుకువెళ్లి ఆంధ్రా లోని గురజాలలో ఉన్నారు. విషయాన్ని కనిపెట్టిన ఆ మహిళ కుటుంబీకులు యువకుడిని చితకబాదిన, మహిళను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్న మహిళ కుటుంబ సభ్యులు ప్రతీకారం కోసం ఎదురు చూశారు.
ఈ క్రమంలో మంగళవారం వీరయ్య, తన బిడ్డ కుమారుడు పెద్ద కొడుకు వెంకటేష్ ఇద్దరు కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్ పై వస్తున్న విషయాన్ని గుర్తించారు. హైదరాబాద్ -అచ్చంపేట ప్రధాన రహదారికి పక్కన ఇటుక బట్టీల వద్ద మాటు వేసిన దుండగులు. కారు తో బైకును ఢీకొట్టారు. వెంటనే బైకుపై ఉన్న వీరయ్య, వెంకటేష్ కళ్లల్లో కారం చల్లి ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా గొడ్డలితో నరకడంతో వీరయ్య అక్కడికక్కడే మరణించాడు. గాయాల పాలు అయినా మృతుని కుమారుడు వెంకటేష్ తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.