నమ్ముకున్న కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధమే.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్

by Mahesh |
ANIL KUMAR
X

దిశ, ఏపీ బ్యూరో: పార్టీ అధికారంలో లేని కష్టకాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, తనను నమ్ముకుని తన వెన్నంటి నడిచిన ప్రతి కార్యకర్త కష్టం తనకు తెలుసని ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో సోమవారం ఆయన 53వ డివిజన్ అభ్యర్థి దేవరకొండ సుజాతను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన దేవరకొండ అశోక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించారని అటువంటి వారికి సరైన సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని తాను నమ్ముకున్నానని ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు మంత్రి స్థాయికి ఎదిగానని అలాగే తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఉన్నత స్థానం దక్కేలా తాను నిరంతరం పని చేస్తానని మంత్రి అనిల్ పేర్కొన్నారు. రైల్వే ట్రాక్ ల పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్న పేదలకు అన్యాయం జరక్కుండా మొదటినుంచి పోరాడింది ఒక్క వైయస్సార్ పార్టీయే అని గుర్తు చేశారు.

Advertisement

Next Story