చెర్రీ-శంకర్ #RC15 లాంచింగ్‌కు బాలీవుడ్ హీరో

by Shyam |
చెర్రీ-శంకర్ #RC15 లాంచింగ్‌కు బాలీవుడ్ హీరో
X

దిశ, సినిమా : మెగా పవర్‌స్టార్ రాంచరణ్, ఇండియన్ స్పీల్‌బర్గ్ శంకర్ కాంబినేషన్‌లో మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. #RC15గా తెరకెక్కనున్న చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థకు ఇది 50వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ మూవీ లాంచింగ్ డేట్‌ను ట్విట్టర్‌లో అఫీషియల్‌గా ప్రకటించిన మేకర్స్.. ఈ నెల 8వ తేదీన పూజా కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

కాగా ఈ లాంచింగ్ కార్యక్రమానికి బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ హాజరుకానున్నాడని సమాచారం. ఇక రాంచరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతేకాదు అవార్డ్ విన్నింగ్ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటల రచయితగా, జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్న చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Next Story