- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడా సంస్థలకు ఆర్‌బీఐ ఆఫర్..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయసెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తొలిసారిగా కార్పొరేట్ సంస్థలను పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు ఆహ్వానించింది. టాటా, బిర్లా, అంబానీ, మహీంద్రా ఇంకా ఇతర బడా పారిశ్రామిక సంస్థలకు విభిన్న బ్యాంకింగ్ లైసెన్స్ కోసం అనుమతిచ్చాయి. రిలయన్స్, ఆదిత్య బిర్లా, టెక్ మహీంద్రా, టాటా సన్స్, సన్ ఫార్మా సంస్థలు లైసెన్స్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాయి. కొందరికీ లైసెన్స్ వచ్చింది. కొన్ని సంస్థలు మాత్రం పేమెంట్ బ్యాంకింగ్ మోడల్ సాధ్యాసాధ్యాలపై పునరాలోచించి రేస్ నుంచి వైదొలిగాయి.
అయితే, తాజాగా ఆర్‌బీఐ బడా కార్పొరేట్ సంస్థలను ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల స్థాయిలో పూర్తిస్థాయి బ్యాంకుల ఏర్పాటుకు అనుమతిచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్‌బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. భారత ప్రైవేట్ రంగ బ్యాంకుల మార్గదర్శకాలు, కార్పోరేట్ నిర్మాణంపై నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. బడా కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలను బ్యాంకుల ప్రమోటర్లుగా అనుమతిచ్చే అవకాశాలున్నాయని నివేదిక తెలిపింది.
అదేవిధంగా రూ. 50 వేల కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణంతో మెరుగ్గా కొనసాగుతున్న బడా నాన్-బ్యాంకింగ్ ఫైనన్స్ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ), 10 ఏళ్ల కార్యకలాపాల అనుభవం ఉన్న కార్పొరేట్ హౌస్ యాజమాన్యంలో ఉన్న సంస్థలను బ్యాంకులుగా మార్చేందుకు అవకాశమివ్వొచ్చని నివేదిక పేర్కొంది. ఆదిత్యా బిర్లా, బజాజ్ గ్రూప్, మహీంద్రా, టాటా సన్స్ వంటి కొన్ని బడా పారిశ్రామిక సంస్థలు ఇప్పటికే దశాబ్దానికిపైగా కార్యకలాపాలతో పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలను కలిగి ఉన్నాయి. నిజానికి, ఈ ఎన్‌బీఎఫ్‌సీలు దేశంలోని అనేక మధ్య తరహా బ్యాంకుల కంటే పెద్దవి. కాగా, బ్యాంకింగ్ రెగ్యులేసన్ యాక్-1949కు అవసరమైన సవరణల తర్వాత మాత్రమే ఈ కొత్త మార్పులు జరగవచ్చని నివేదిక వెల్లడించింది.