- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కీలక వడ్డీ రేట్లు యథాతథమే
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అత్యంత వేగంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇటీవల కోలుకుంటున్న ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా గతవారం కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 4 శాతం వద్దే కొనసాగించాలని కోరడం కూడా వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవడానికి కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను నిర్ణయించే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఎంపీసీ నిర్ణయాలను బుధవారం వెల్లడించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొదటి ఎంపీసీ సమావేశం కావడంతో వడ్డీ రేట్లపై అందరి అంచనాలు పెరిగాయి. అయితే, పెరుగుతున్న కరోనా కోలుకుంటున్న ఆర్థికవ్యవస్థకు సవాలుగా ఉండనుందని హౌసింగ్, మకా సంస్థల సీఈఓ ధృవ్ అగర్వాలా తెలిపారు. ఈ పరిణామాలతో రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి పెరిగే అవకాశాలున్నాయని, ఈ సమయంలో కీలక వడ్డీ రేట్లను సవరించేందుకు ఎంపీసీ ఆసక్తి చూపించకపోవచ్చని ధృవ్ వెల్లడించారు.