మరోసారి కీలక వడ్డీ రేట్లు యథాతథమే: నిపుణులు!

by Harish |
మరోసారి కీలక వడ్డీ రేట్లు యథాతథమే: నిపుణులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కొవిడ్-19 మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థను సైతం ఆందోళనకు గురి చేస్తున్న క్రమంలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని నిపుణులు తెలిపారు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు వృద్ధి అవకాశాన్ని పెంపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు చేయకుండా సానుకూల సమయం కోసం వేచి ఉండొచ్చని తెలిపారు. ఆర్‌బీఐ గవర్నర్ షక్తికాంత దాస్ ఆధ్వర్యంలో ఈ నెల 6-8 తేదీల మధ్య ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ) సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను బుధవారం దాస్ వెల్లడించనున్నారు. కొత్త కరోనా వేరియంట్ వల్ల అనిశ్చిత పరిస్థితులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతే ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై మార్పు నిర్ణయం తీసుకోగలదని కోటక్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. అలాగే, రివర్స్ రెపో రేటు విషయంలో కొంతమేర సవరణకు అవకాశం ఉందని ఎస్‌బీఐ పరిశోధనా నివేదికతో పాటు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్‌లు అభిప్రాయపడ్డాయి. ఇదే సమయంలో భవిష్యత్తులో రెపో రేట్లలో మార్పులు ఉండవచ్చని, దీనివల్ల గృహ రుణాల వడ్డీ రేట్లు పెరగవచ్చని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed