రాయలసీమ సాగునీటి సాధన సమితి

by srinivas |
nandyala 1
X

దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను వైద్య కళాశాల బదాలాయింపు చేయడం సరైన చర్య కాదని విశ్వవిద్యాలయం గత సంవత్సర కాలంలో అనేక సందర్భాలలో ప్రభుత్వానికి తెలిపిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ ని అకస్మీకంగా ప్రభుత్వం బదిలీ చేయడాన్ని నిరసిస్తూ నంద్యాల ఆర్‌ఏఆర్‌ఏస్ కేంద్రం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి,కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ప్రజా, రైతు,వ్యవసాయకూలీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం విశిష్టతను, ఆవశ్యకతను వివరిస్తూ ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, పరిశోధనా అధికారులు, రిజిస్ట్రార్ పలు సందర్భాల్లో ప్రభుత్వానికి ఉత్తరాలు ద్వారా తెలిపారని అన్నారు.

నంద్యాల పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు బదలాయింపు చేయవద్దని ఈ ఉత్తరాల ద్వారా ప్రభుత్వాన్ని కోరారని, వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు బదలాయింపు చేపట్టవద్దని వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు సమావేశంలో కూడా తీర్మానం చేసారని తెలిపారు. వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు బదలాయింపుకు వ్యతిరేకంగా రైతులు కోర్టుకు పోయిన సందర్భంలో కూడా పరిశోధనా స్థానం భూముల పరిరక్షణకై కోర్టులో అఫడవిట్ వేయడానికి నంద్యాల పరిశోధనా స్థానం ఏ డి ఆర్ కు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అనుమతులిచ్చారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసారు. ఉన్నతాధికారుల అనుమతుల ప్రకారం వ్యవసాయ పరిశోధనకు భూములు అవసరమని, వైద్య కళాశాలకు బదలాయింపుకు వ్యతిరేకంగా కోర్టులో ఏ డి ఆర్ అఫిడవిట్ వేసారని వారు పేర్కొన్నారు.

నంద్యాల పరిశోధనా స్థానం భూముల పరిరక్షణకు అనుకూలంగా కోర్టులో విశ్వవిద్యాలయం అఫిడవిట్ దాఖలు చేసిన తదనంతరం, స్థానిక రాజకీయ నాయకుల వత్తిళ్లు విశ్వవిద్యాలయం పైన పెరిగాయనీ, దీనితో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు బదలాయింపుపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయం పైన ఒత్తిడి పెంచిందని వారు విమర్శించారు. ఒక చారిత్రక, రైతు సంక్షేమానికి, దేశ ఆహార భద్రతకు కీలకమైన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంను పరిరక్షించాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గారని రైతు నాయకులు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు గతంలో అనేక సందర్భాలలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు ఇవ్వడానికి సానుకూలంగా స్పందించారనీ, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు బదలాయించడానికి సానుకూలం అంటూ ప్రభుత్వానికి ఉత్తరం వ్రాసారని తెలిపారు. అత్యవసర విశ్వవిద్యాలయం బోర్డు సమావేశం ఏర్పాటు చేసి పరిశోధనా భూములు బదలాయింపుకు తీర్మానం చేసారని పేర్కొన్నారు.

Advertisement

Next Story