- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాయల
దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త రాయల నాగేశ్వరరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో ఉన్న పార్టీ శ్రేణుల పెద్ద ఎత్తున కలెక్టరేట్ ర్యాలీగా చేరుకున్న రాయల జిల్లా కలెక్టర్ కు వీపీ గౌతమ్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు పోట్లనగేశ్వరావు, ఖమ్మం నగర అధ్యక్షుడు జావిద్ లు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి ఆశీస్సులతో బీఫామ్ ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అవలంబిస్తున్న నియంతృత్వ పోకడను అడ్డుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాయల రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.