- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ మంత్రులకు కీలక పదవులు..

X
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం విస్తరణకు ముందు రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవడేకర్‌లను పార్టీ సీనియర్ పదవుల్లో నియమించనున్నట్టు తెలిసింది. పార్టీ జనరల్ సెక్రెటరీలుగా లేదా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించే అవకాశమున్నట్టు పార్టీవర్గాలు వివరించాయి. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ ముఖ్యమైన బాధ్యతలు వారికి అప్పగించే ప్లాన్స్ ఉన్నాయని తెలిపాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యదర్శులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎన్నికల రాష్ట్రాల్లో ఎలక్షన్ స్ట్రాటజీపైనా చర్చలు జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవడేకర్‌ల ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.
Next Story