- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మమ్మల్ని ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవడం లేదు
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు తమ జట్టులో ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలని ఇప్పటికే ఆయా జట్లు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ రిటెన్షన్ పాలసీని విడుదల చేసింది. దాని ప్రకారం ముగ్గురు స్వదేశీ ప్లేయర్లు లేదా ఇద్దరు స్వదేశీ ఒక విదేశీ లేదా ఇద్దరు విదేశీ ఇద్దరు స్వదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉన్నది. దీంతో కీలకమైన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు తమతో ఉంచుకునేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వారి మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో సహా తనను రిటైన్ చేసుకోవడానికి సిద్ధంగా లేదని రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. తాజాగా తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడిన అశ్విన్.. ఐపీఎల్ 2022 మెగా వేలం గురించి చర్చించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ ఇద్దరు స్వదేశీ ఒక విదేశీ ప్లేయర్‌ను అట్టిపెట్టుకోనున్నది. కెప్టెన్ రిషబ్ పంత్, పృథ్విషాతో పాటు ఎన్రిక్ నోర్జేను జట్టులో కొనసాగించనున్నారు. నన్ను, శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోబోవడం లేదు. ఒకవేళ ఢిల్లీ ఫ్రాంచైజీ తమను కొనసాగించాలనుకుంటే ఇప్పటికే సమాచారం అందించే వాళ్లు. కానీ, అలాంటిదేమీ జరగలేదు’ అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా, వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అశ్విన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.