21 ఏళ్లలో అలా చేస్తే తప్పన్నారు :రవీనా టాండన్

by Shyam |
21 ఏళ్లలో అలా చేస్తే తప్పన్నారు :రవీనా టాండన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి రవీనా టాండన్ 21 ఏళ్ల వయస్సులో ఇద్దరు పిల్లల(ఛాయ, పూజ)ను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. 1995లో జరిగిన ఘటన హెడ్ లైన్స్‌లో నిలిచింది. కెరియర్ పీక్స్‌లో ఉండగా.. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అసమానమైనదని కొందరు ప్రశంసించినా.. కొందరు మాత్రం కామెంట్ చేశారంది రవీనా. ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్‌గా ఉన్న తనను ఎవరైనా పెళ్లి చేసుకునేందుకు ముందుకొస్తారా అన్నారని.. కానీ అలాంటి మాటలను తను లెక్కచేయలేదని తెలిపింది. మ్యారేజ్ కాకపోయినా పరవాలేదు అనుకున్నానని చెప్పింది. తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అదే అన్న రవీనా.. పిల్లలతో ఉన్న ప్రతీ క్షణం తనకు చాలా స్పెషల్ అని తెలిపింది. వారిని చేతుల్లోకి తీసుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు ప్రతీది కూడా బెస్ట్ ఫీలింగ్ అని సంతోషం వ్యక్తం చేసింది రవీనా.

రవీనా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానిని పెళ్లి చేసుకోగా.. దత్తత తీసుకున్న తన ఇద్దరు పిల్లలు కారులో చెరోవైపున కూర్చుని తనను పెళ్లి మండపానికి తీసుకువెళ్లిన క్షణాలు మరింత ఆనందాన్నిచ్చాయని తెలిపింది. కాగా ప్రస్తుతం పిల్లలను కలిగి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఛాయ, పూజ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఇద్దరూ కూడా చక్కగా సెటిల్ అయిపోయారని చెప్పింది. వీరిలో పూజ ఈవెంట్ మేనేజర్ కాగా, ఛాయ ఎయిర్ హోస్టెస్‌గా వర్క్ చేస్తుంది. ఇక రవీనా, అనిల్ తడానిలకు ఇద్దరు పిల్లలు(రష, రణ్‌బీర్ వర్ధన్) ఉన్నారు.

Advertisement

Next Story