- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళా జర్నలిస్టులు పెద్ద శాడిస్టులు.. బాలీవుడ్ నటి కామెంట్స్
దిశ, సినిమా: నటనతోపాటు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్.. తాజాగా జర్నలిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సమాజంలో ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులని ఆవేదన వ్యక్తం చేసిన నటి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహిళా జర్నలిస్టుల గురించి పలు విషయాలు వెల్లడించింది. ‘1990లో కొంతమంది మహిళా జర్నలిస్టులు, ఎడిటర్ స్థాయిలో ఉన్నవాళ్లు కూడా హీరోయిన్ల ఎదుగుదలను జీర్ణించుకునేవారు కాదు.
ఏ నటి అయినా హీరోలను ప్రేమిస్తుందని తెలిస్తే బాడీ షేమింగ్ గురించి మాట్లాడేవారు. మానసికంగా అవమానించేవారు. ఎందుకంటే వారి స్వప్రయోజనాల రీత్యా ఆ జర్నలిస్టులకి హీరోలను ప్రేమించే హీరోయిన్లు అంటే ఇష్టం ఉండేది కాదు. మహిళా జర్నలిస్టుల దయతోనే వాళ్లు బతకాలనే ఇగో ఉండేది. కానీ నేడు సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి పరిస్థితులు లేవు. అందుకు నేను సోషల్ మీడియాకు థాంక్స్ చెబుతున్నాను’ అని తెలిపింది. ఇప్పుడు అభిమానులతో నేరుగా మంచి-చెడు ప్రతీ విషయాన్ని పంచుకునే వెసులుబాటు ఉన్నందునా.. జర్నలిస్టులకు ఎవరూ భయపడట్లేదనే విషయాన్ని నొక్కి చెప్పింది. కాగా రవీనా నటించిన నెట్ఫ్లిక్స్ షో ‘అరణ్యక్’ డిసెంబర్ 10న రిలీజ్ కానుంది.
- Tags
- Journalists