ఉద్యోగుల తొలగింపు పరిష్కారం కాదు : టాటా

by Harish |
ఉద్యోగుల తొలగింపు పరిష్కారం కాదు : టాటా
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ వలన చాలా కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్‌కు డిమాండ్ లేకపోయింది. దీంతో పలు కంపెనీలు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూశాయి. అయితే, వాటి నుంచి బయటపడేందుకు చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. దీనిపై దేశీయ దిగ్గజం టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ గౌరవ చైర్మన్ రతన్ టాటా స్పందించారు. నష్టాలు వస్తున్నాయనే కారణం చూపి ఉద్యోగులను తీసివేయడం సరికాదని.. దానివల్ల పరిష్కారం లభించదని టాటా పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల సున్నితంగా వ్యవహరించలేని కంపెనీలు మనుగడ సాగించలేవని తెలిపారు. వ్యాపారం అంటే కేవలం డబ్బుతో ముడిపడేది కాదని.. యాజమాన్యానికి నైతిక బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు. లాక్‌డౌన్ వలన టాటా గ్రూప్‌కు చెందిన అనేక వ్యాపారాలు దెబ్బతిన్నప్పటికీ , ఆ సంస్థ ఒక్క ఉద్యోగినీ కూడా తొలగించలేదు.

Advertisement

Next Story