- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సార్ మా బడికి టీచర్‌ను పంపండి.. విద్యార్థుల రాస్తారోకో
దిశ, చండూర్ : ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు రెండుగంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు. దీంతో గత 2 నెలల క్రితం కలెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా కమిటీ చైర్మన్ బరిగేల లింగస్వామి రోడ్డుపైన బైఠాయించారు.
పాఠశాలలో 515 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సరైన ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉపాధ్యాయున్ని నియమించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేనియెడల విద్యా కమిటీ చైర్మన్ లింగస్వామి నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలారి రవి, వర్కాల నరసింహ, బొమ్మరగోని రామలింగయ్య, జెర్రిపోతుల ధనుంజయ్ గౌడ్, జోగు కృష్ణ, పందుల గిరి, చో ల్లేటి దశరథ, జిల్లా శ్రవణ్, వివిధ గ్రామాల తల్లిదండ్రులు, విద్యార్థులు భార్గవి, కావ్య, రాధిక, భాగ్యశ్రీ, పూజ, శృతి, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- High school