ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.. నేను లవ్‌లో పడిపోయా అంటున్న నటి రష్మిక

by Shyam |
ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.. నేను లవ్‌లో పడిపోయా అంటున్న నటి రష్మిక
X

దిశ, సినిమా : హిందీ మూవీ ‘గుడ్ బై’ షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ముంబైలో ఉన్న రష్మిక.. ప్రతీ విషయాన్ని తన ‘డియర్ డైరీ’ ద్వారా ఫ్యాన్స్‌కు అప్‌డేట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా పెట్ డాగ్ ‘ఔరా’ ఫొటోను షేర్ చేసిన డియర్ కామ్రేడ్ యాక్ట్రెస్.. ‘ఇన్ లవ్’ అనే క్యాప్షన్‌ జోడించింది. ఇక ఆ ఇమేజ్‌పై ‘గైస్ చెప్తున్నా వినండి.. నేను పెట్‌తో ప్రేమలో మునిగిపోయాననే విషయం అర్థమైంది’ అంటూ క్లారిటీ ఇచ్చింది. కాగా మరో పోస్ట్‌లో తన పేరెంట్స్‌కు మ్యారేజ్ డే విషెస్ తెలిపిన రష్మిక.. వారిని ఎంతగా ప్రేమిస్తుందో తెలుపుతూ లాంగ్ నోట్ రాసుకొచ్చింది.

Actress-rashmika

గతేడాది అక్టోబర్ తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లలేదని, ఇన్ని రోజులు వాళ్లను విడిచిఉండటం కష్టంగా ఉందని చెప్పింది. పేరెంట్స్‌‌తో మంచి ఫొటో దిగి కూడా చాలా రోజులైందని వెల్లడించింది. అయితే అవన్నీ పక్కనబెట్టండి అంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. తనకు జన్మనివ్వడమే కాకుండా, నచ్చిన లైఫ్‌ లీడ్ చేసుకునే అవకాశమిచ్చినందుకు థాంక్స్ చెప్పింది.

Advertisement

Next Story