ఎమర్జెన్సీ విధించాలి : రష్మీ గౌతమ్

by Shyam |
ఎమర్జెన్సీ విధించాలి : రష్మీ గౌతమ్
X

దిశ, వెబ్‌డెస్క్: రష్మీ గౌతమ్.. సినిమాలతో అంత క్రేజ్ తెచ్చుకోలేకపోయిన ఈ భామ… జబర్ధస్త్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ప్రతీ విషయంలో సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే రష్మీ… కరోనా వైరస్‌, దాని ప్రభావంపై పోస్ట్ పెట్టింది. దీనిపై కొందరు తనను సమర్ధించగా మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. దీంతో వార్ మానేసి కరోనా బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించింది. తనను ట్రోలింగ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏముంటుంది?.. మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు, మిత్రులకు కరోనా గురించి అవగాహన కల్పించి పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడాలని కోరింది.

ఇంతకీ విషయం ఏంటంటే… కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు, మాల్స్, విద్యా సంస్థలు మూసేసింది ప్రభుత్వం. కానీ షూటింగ్‌లను ఆపేయాలని మాత్రం సూచించలేదు. కాకపోతే కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం మూవీ యూనిట్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా షూటింగ్‌లను వాయిదా వేశాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రొడక్షన్ హౌజ్ కాంట్రాక్టుల్లో పని చేసే తనలాంటి నటులు తప్పకుండా షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తుందని తెలిపింది. ప్రొడక్షన్ హౌజ్‌లు షూటింగ్ క్యాన్సల్ చేస్తేనే తాము ఇంటి వద్ద జాగ్రత్తగా ఉంటామని.. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోగలమని చెప్పింది. కరోనా ఎఫెక్ట్ వల్ల మెగాస్టార్ చిరంజీవి సినిమా వాయిదా పడొచ్చు కానీ.. తాము మాత్రం షూటింగ్‌లో పాల్గొనాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తేనే ప్రొడక్షన్ హౌజ్‌లు షూటింగ్ బంద్ చేస్తాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed