- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈరాశి వారికి చెప్పలేనంత అదృష్టం
మేష రాశి : ఈరోజు ఈరాశివారు చాలా ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక వ్యాధులు మిమ్ముల్ని బాధిస్తాయి. దీంతో ఈరోజు మీరు ఆసుపత్రుల్లో అధికంగా ఖర్చుచేస్తారు. స్నేహితులు, బంధువులు మీకు ఈరోజు ప్రతీ విషయంలో అండగా ఉండాటు. నిరుద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అంది పుచ్చుకొని ముందుకు సాగుతారు.వైవాహిక జీవితం బాగుంటుంది.
వృషభ రాశి : మీకు పనులు చేసుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది. ఆర్థికపరంగా మీకుమిశ్రమంగా ఉంటుంది.మీరు ధనార్జన చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ప్రవర్తించడం మీ మనస్సును గాయపరుస్తుంది. ఈరోజు ఈ రాశులోని కళాకారులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఎన్నో కొత్త అవకాశాలు వస్తుంటాయి.
మిథున రాశి :ఈ రాశివారికి ఈరోజు సానుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఆఫీసుల్లో ఉన్నవారికి పని అధికం అవుతుంది. దీంతో కాస్త అలసటకు లోను అవుతారు. కానీ ఇతరుల సహాయంతో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఉమ్మడి వ్యాపారస్థులు పెట్టుబడులు పెట్టేముందు కాస్త ఆలోచించడం మంచిది.
కర్కాటక రాశి : ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలకోసం శ్రమించాల్సి వస్తుంది. నేడు మీకు డబ్బు విలువ బాగా తెలిసి వస్తుంది. ఎందుకుంటే అవసరానికి చేతికి డబ్బు అందదు. దీంతో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగుల్లో నిరుత్సాహం తప్పదు. విద్యార్థులకు కలిసి వస్తుంది.
సింహ రాశి :ఈరోజు స్థిరాస్థులమీద పెట్టుబడి మీప్రాణాలమీదకు తెస్తుంది.కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంటుంది. మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు.రోజుమొత్తము మీరు దీనివలన విచారానికి గురిఅవుతారు. ఈరోజుమీరు ఒంటరిగా సమయాన్నిగడిపి మానసికప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసం.
కన్యా రాశి :ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదురుకుంటారు.అందువలన మనీ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ చిన్నారి ఆరోగ్యం పాడవడం మీకు చాలా సమస్యలను తీసుకొస్తుంది. వ్యాపారస్థులకు నష్టాలు తప్పవు. ఈరోజు ఈ రాశి వారు దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది వీరికి లాభదాయకంగా మారుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
తుల రాశి :ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగు పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనాలను ఇస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా నిలదొక్కుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. తోబుట్టువులతో సమస్యలు ఎదురవుతాయి.
వృశ్చిక రాశి : ఈరోజు ఈరాశి వారు చాలా సంతోషంగా గడుపుదాం అనుకుంటారు. కానీ వారికి నిరాశే ఎదురవుతుంది. అలాగే నేడు వీరు విందు, వినోదాలకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఎన్నో కొత్త అవకాశాలు వస్తుంటాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు బాగుంటుంది.
ధనస్సు రాశి : ఈరోజు మీకుటుంబంలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అది మీకు టెన్షన్ కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయి, కానీ స్నేహితుల సహాయంతో వాటి నుంచి బయట పడగలు.ఈరాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది,లేనిచో మీయొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకర రాశి :మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపు పొందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. బహుకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త దూరపు బంధువునుండి అందడంవలన మీ కుటుంబం అంతటికీ ప్రత్యేకించి మీకు సంతోషాన్ని కలిగించగలదు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ జీవితం గౌరవప్రదంగా సాగిపోతుంది. కొత్త ఆఫర్లకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభ రాశి :మీరు మీకుటుంబసభ్యులతో పెట్టుబడులు,పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది.వారియొక్క సలహాలు మీకు చాలావరకుమీయొక్క ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లనించి తప్పిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. ప్రతీ పనిలోనూ విజయం మీదే అవుతుంది.
మీన రాశి :ఈ రాశి వారికి ఈరోజు చెప్పలేనంత అదృష్టం. ఈ రాశిలో ఉన్న అన్నిరంగాల వారికి కలిసి వస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిపే అవకావం ఉంది. దీంతో మీరు రోజు మొత్తం చాలా సంతోషంగా, సందడిగా గడుపుతారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అద్భుతమైన అవకాశాలను పొందడానికి అత్యుత్తమమైన రోజు కానుంది. ఐటి రంగంలో ఉన్నవారు, విదేశాలనుండి ఆహ్వానం అందుకోగలరు. ఈరాశికి చెందిన పిల్లలు రోజుమొత్తము ఆటలుఆడటానికి మక్కువ చూపుతారు.తల్లితండ్రులు వారిపట్ల జాగురూపకతతో వ్యవహరించాలి,లేనిచో వారికి దెబ్బలుతగిలే ప్రమాదం ఉన్నది.
- Tags
- Today