ప్రభుత్వ పాఠశాలకు అరుదైన ఘనత

by Anukaran |
ప్రభుత్వ పాఠశాలకు అరుదైన ఘనత
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల దెబ్బకు ప్రభుత్వ బడుల్లో పిల్లలు తగ్గిపోవడం సహజం. దీనికి భిన్నంగా పక్కనే ఉన్న ప్రైవేటు పాఠశాలను అధిగమించి అడ్మిషన్లు పెంచుకోవడం తిరుపతిలోని ఓ ప్రభుత్వ పాఠశాల సాధించిన విజయం. తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు (పశ్చిమ) ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఈ అరుదైన ఘనత సాధించింది.

ఈ ఏడాది 174 కొత్త అడ్మిషన్లు సాధించి ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది. గతంలో 98 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాల ఈ ఏడాది 272 మంది విద్యార్థులకు పెరగడం శుభ పరిణామం. ఇక్కడి ఉపాధ్యాయుల అంకితభావం, ప్రణాళికాబద్ధ కృషి కారణంగా ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు 55 మంది పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ పాఠశాల బలోపేతం కావడంతో దీనికి సమీపంలోని ప్రైవేటు పాఠశాల మూతపడింది. రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలలకు తగిన ప్రోత్సాహం అందిస్తే ఇలాంటి మరిన్ని ఆదర్శ పాఠశాలలను మనం చూడొచ్చు.

Advertisement

Next Story